Sunday, January 19, 2025

ఉ.11గంటలకు ఇంటర్ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

ఇంటర్మీయట్ పరీక్షల ఫలితాలను బుధవారం (ఏప్రిల్ 24) ఉదయం 11గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్లు బోర్డు తెలిపింది. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వరకు జరిగిన విషయం తెలిసిందే. ఫలితాల కోసం tsbie.cgg. gov.in, results.cgg.gov.in వెబ్‌సైట్లలో సంప్రదించాలని ఇంటర్ బోర్డు సూచించింది.

ఫలితాల ప్రకటన అనంతరం విద్యార్థుల సౌలభ్యం కోసం మార్కుల జాబితాను వివిధ మార్గాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు బోర్డు వివరించింది. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే ప్రైవేట్ విద్యార్థులకు హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. హాజరు మినహాయింపు కోసం మే 1వ తేదీలోపు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించాలని కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. విద్యార్థులకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు సరిగ్గా లేకున్నా, వివరాలు అసంపూర్తిగా ఉన్నా దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News