Saturday, December 21, 2024

హేమచంద్ర-శ్రావణి భార్గవి విడాకులు తీసుకున్నారా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సింగర్లు హేమచంద్ర, శ్రావణి భార్గవి పాటలు పాడి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఇద్దరు సినిమా పాటలు పాడుతూ ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. గత కొన్ని రోజులు ఇద్దరు విడిగా ఉంటున్నట్టు సమాచారం. ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. శ్రావణి-హేమచంద్ర ఇప్పటివరకు విడిపోయినంటూ అధికారికంగా ప్రకటించలేదు. గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇద్దరు కలిసి కనిపించిన సంఘటనలు లేకపోవడంతో విడిపోయారనే అనుమానాలు నిజం అవుతున్నాయి.

తాజా ఆమె తన కూతురితో కలిసి తన పుట్టింట్లో ఉంటుంది. హేమచంద్ర ఒక్కడే జీవనం సాగిస్తూ పాటలు పాడుతూ తన కేరీర్‌లో ముందుకు పోతున్నాడు. హేమచంద్ర తన స్నేహితులతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. భార్గవి తన కూతురితో కలిసి ఉన్న ఫొటోలతో పాటు అప్పుడప్పడు పాడ్ కాస్ట్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంది. తన కూతురితో కలిసి లగేజ్ బ్యాగ్‌తో ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో భార్గవి షేర్ చేసింది. దీంతో మా హేమచంద్రుడు ఎక్కడ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరు కలిసి ఉండాలని కోరుకుంటున్నామని అభిమానులు కోరుతుున్నారు. హ్యాపీ జర్నీ కామెంట్లు చేశారు. ఈ పోస్టుతోనే శ్రావణి భార్గవి క్లారిటీ ఇచ్చిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. విడిపోయారనే దాని ఈ పోస్టు చెబుతుందని నెటిజన్లు వాపోతున్నారు. స్త్రీలు ఎల్లప్పుడూ కుడి వైపు ఉంటారని, పురుషులు ఎడమవైపు ఉండటం మంచిది అని ఆమె కామెంట్లో రాసుకోచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News