లోక్‌సభ ఎన్నికల ప్రధాన ప్రచారానికి బీఆర్‌ఎస్ సిద్ధమైంది. తెలంగాణ భవన్ నుండి పోరుబాటకు బయలుదేరారు బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ తల్లికి పూలమాల వేసి కెసిఆర్ బస్సుయాత్ర ప్రారంభం అయింది. కెసిఆర్ కు మంగళహారతులతో మహిళలు స్వాగతం పలికారు. తెలంగాణ భవన్ నుంచి మిర్యాలగూడకు బయలుదేరారు కెసిఆర్. దీంతో బిఆర్ఎస్ కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో కెసిఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది.
కెసిఆర్ పర్యటన పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని బీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన పార్టీ అభ్యర్థులు, సీనియర్ నేతల సమావేశంలో ఆయన రాష్ట్రంలో కనీసం ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేసినప్పటికీ, మెదక్‌లో పార్టీకి మంచి అవకాశాలు ఉన్నాయని, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్‌లో మంచి అవకాశాలు ఉన్నాయని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు.