Saturday, December 21, 2024

కవిత బెయిల్ పై మే 6న తీర్పు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై బుధవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఇడి, సిబిఐ కేసుల్లో కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టులో వాదనలు ముగిశాయి. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సిబిఐ కేసులో మే 2న తీర్పు వెల్లడించనుంది. అదే విధంగా ఇడి కేసులో బెయిల్‌పై మే 6న తీర్పు వెల్లడిస్తామని కోర్టు పేర్కొంది. మే 7తో కవిత జ్యూడిషియల్ కస్టడీ ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఇడి అధికారులు గత నెల 15న అరెస్ట్ చేసిన సంగతి విదితమే. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆమె, తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా రౌస్ అవెన్యూ కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై బుధవారం మరోసారి విచారణ జరిగిన సందర్భంగా ఇడి తరఫున న్యాయవాది జోయబ్ హుస్సేన్ సుదీర్ఘ వాదనలు వినిపించారు. మనీలాండరిం గ్ కేసులో అనేకమంది నిందితులకు బెయిల్ రాలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మనీష్ సిసోదియా బెయిల్ పిటిషన్‌ను అన్ని కోర్టులు తిరస్కరిం చాయని, తప్పు జరిగినట్లుగా సుప్రీంకోర్టు సైతం నిర్ధారించిందని వెల్లడించారు. మద్యం వ్యాపారం కోసం శ్రీనివాసులు రెడ్డి కేజ్రీవాల్‌ను కలిశా రని, కవితను కలవమని కేజ్రీవాల్ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెప్పారని ధర్మాసనానికి వెల్లడించారు. శ్రీనివాసులు రెడ్డి కవితను హైదరా బాద్‌లో కలిశారని, కేజ్రీవాల్ రూ.100 కోట్లు అడిగారని కవిత శ్రీనివాసులు రెడ్డికి చెప్పారని వివరించారు.

రూ.50 కోట్లు ఇవ్వాలని కవిత శ్రీనివాసులు రెడ్డిని కోరారని స్పష్టం చేశారు. మరోవైపు అభిషేక్, బుచ్చిబాబుకు రాఘవ రూ.25 కోట్లు ఇచ్చారని, ముడుపుల ద్వారా ఇండో స్పిరిట్స్‌లో కవిత భాగస్వామ్యం పొందారని జోయబ్ హుస్సేన్ పేర్కొన్నారు. వ్యాపారంలో కవితకు 33 శాతం వాటా కోసం బుచ్చిబాబు పని చేశారని వెల్లడించారు. బుచ్చిబాబు, మాగుంట రాఘవ వాట్సప్ చాట్స్‌లో ఆధారాలున్నాయన్న ఆయన, కోర్టు అనుమతితోనే నిందితులు అప్రూ వర్లుగా మారారని తెలిపారు. అప్రూవర్లను అనుమానించడం కోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టడమేనన్న ఇడి తరఫు న్యాయవాది, కవితకు నోటీసు లిచ్చాకే పిళ్లై స్టేట్‌మెంట్ వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. కవిత ఒత్తిడితోనే అరుణ్ పిళ్లై వెనకడుగు వేశాడని ఆరోపించారు.

మరోవైపు కవిత తన ఫోన్లలో సమాచారం డిలిట్ చేశారని ఇడి కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఆమె ఇచ్చిన 10 ఫోన్లనూ ఫార్మాట్ చేసి ఇచ్చారని, సమాచారం తొలగించడంపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదని పేర్కొంది. కవిత సాక్ష్యాలు ధ్వంసం చేశారని, సాక్షులను బెదిరించారని ఆరోపిస్తూ వాదనలను ముగించారు. అయితే ఇడి వాదనలపై రిజాయిన్డర్ లిఖితపూర్వకంగా ఇస్తామని కవిత తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం బెయిల్ పిటిషన్‌పై మే 6న తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News