Thursday, December 26, 2024

నటి తమన్నకు మహారాష్ట్ర సైబర్ సెల్ సమన్లు

- Advertisement -
- Advertisement -

ముంబై: వచ్చే సోమవారం తమ ముందు హాజరు కావాలని మహారాష్ట్ర సైబర్ సిబ్బంది నటి తమన్నకు సమన్లు జారీ చేశారు. మహాదేవ్ ఆన్ లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్ తాలూకు సబ్సిడరీ యాప్ లో ఐపిఎల్ మ్యాచ్ లూ చూడాలంటూ తమన్నా భాటియా ప్రమోట్ చేయడంతో ఈ సమన్లు జారీ చేశారు. ఏప్రిల్ 29న మహారాష్ట్ర సైబర్ సిబ్బంది ముందు హాజరు కావలసిందిగా నటికి సమన్లు జారీ చేసినట్లు  ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ‘ఫెయిర్ ప్లే బెట్టింగ్’ లో ఐపిఎల్ మ్యాచ్ లు చూడాల్సిందిగా తమన్న ప్రమోట్ చేసింది. అందుకే ఆమెను మహారాష్ట్ర సైబర్ సిబ్బంది తమ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు.

కేసులో సాక్షి గా తన వాంగ్మూలాన్ని నటి రికార్డు చేయాలని అధికారులు ఆమెను పిలిచారు. మహారాష్ట్ర సైబర్ విభాగం ఇప్పటికే గాయకుడు బాద్షా, నటుడు సంజయ్ దత్ మేనేజర్, నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్ మేనేజర్ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అక్రమ లావాదేవీలు, బెట్టింగ్ లకు పాల్పడుతుందన్న ఆరోపణలు రావడంతో ‘మహాదేవ్ యాప్’ పరిశోధన సంస్థల నిఘాలో ఉంది. నటి తమన్న భాటియా ‘బాహుబలి’ సినిమాలో, నెట్ ఫ్లిక్స్ సంకలనం ‘లస్ట్ స్టోరీస్ 2’ లో నటించి బాగా గుర్తింపు తెచ్చుకుందన్నది తెలిసిన విషయమే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News