Monday, December 23, 2024

ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు.. మరోవైపు ఎదురుకాల్పులు

- Advertisement -
- Advertisement -

ఒడిశాలో భద్రతాదళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బౌద్ జిల్లా పర్హెల్ ప్రాంతం లోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున ఈ సంఘటన చోటు చేసుకుందని పోలీస్ ఉన్నతాధికారి సౌమేంద్ర ప్రియదర్శి తెలిపారు. మృతదేహాలను గుర్తించడానికి లొంగిపోయిన మావోయిస్టుల సహకారం తీసుకుంటున్నట్టు చెప్పారు. అయితే ఈ కాల్పుల్లో ఒకరు గాయపడ్డారని, చెప్పారు.

కాల్పులు జరిగిన ప్రాంతంలో పేలుడు పదార్ధాలు, గ్రైనేడ్ లాంచర్ లభించాయని , వాటిని సీజ్ చేశామన్నారు.ఒడిశాలో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సంఘటన చోటు చేసుకున్న బౌద్‌లో మే 20న ఎన్నికలు జరగనున్నాయి. గత నాలుగు నెలల్లో బౌద్ ప్రాంతంలో ఈ తరహా సంఘటనలు 7 చోటు చేసుకున్నాయని సౌమేంద్ర ప్రియదర్శి ఉదహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News