Thursday, December 19, 2024

శుక్రవారం రాశి ఫలాలు(26-04-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగిన చివరికి పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. శుభవార్తలు అందుకుంటారు.

వృషభం – దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.  అనుకొని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటారు.

మిథునం – ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. పనులలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం,  వాహనాల పట్ల నిర్లక్ష్యం తగదు. సంతానమునకు సాంకేతిక విద్యా అవకాశాలు పొందుతారు.

కర్కాటకం – గృహ నిర్మాణ ఆలోచనలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఊహించిన విధంగా ధన లాభం పొందుతారు.

సింహం – ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది.

కన్య – స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు వద్దు.

తుల – కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. కాంట్రాక్టులు  దక్కించుకొంటారు.స్వల్ప లాభాలు పొందుతారు.

వృశ్చికం – వృత్తి- వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ రంగాలలో వారికి ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్వల్ప ధన లాభ సూచన.

ధనుస్సు – అనేక  అంశాలు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యం నలతగా ఉండటం, ఆలోచనలు అధికమవడం,వత్తిడి మొదలైన కారణాల వలన మానసిక సౌఖ్యం లోపిస్తుంది.

మకరం – ఆర్థికమైనటువంటి లోటుపాట్లను తీర్చుకోవడానికి అధికంగా శ్రమించవలసి వచ్చినప్పటికీ మంచి ఫలితాలను సాధించగలుగుతారు. రహస్య వ్యూహాలను అవలంబిస్తారు. నూతన ఆలోచనలు కలిసివస్తాయి.

కుంభం – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులను కలిసి విహారయాత్రలు చేస్తారు. క్రయవిక్రయాలలో స్వల్పమైన లాభాలను అందుకోగలరు.

మీనం – ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. సంతానమునకు నూతన విద్యావకాశాలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News