Monday, December 23, 2024

అమెరికా పోలీసు కాల్పులలో భారతీయ సంతతి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: ఒక మహిళతోపాటు ఇద్దరు పోలీసు అధికారులను తన వాహనంతో ఢీకొట్టి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన భారతీయ సంతతికి చెందిన ఒక 42 ఏళ్ల వ్యక్తి పోలీసు కాల్పులలో మరణించాడు. తన రూమ్ మేట్‌గా ఉన్న మహిళపై కారుతో దాడి చేసినట్లు ఆరోపణలు రావడంతో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన సచిన్ సాహును అరెస్టు చేసేందుకు శాన్ ఆంటోనియో పోలీసులుఏప్రిల్ 21న షేవియల్ హైట్స్‌లోనిఅతని ఇంటి వద్దకు వెళ్లారు. పోలీసులను చూసి తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో వారిని తన కారుతో ఢీకొట్టాడు.

టైలర్ గర్నర్ అనే పోలీసు అధికారి జరిపిన కాల్పులలో సాహు అక్కడికక్కడే మరణించాడు. అతని వద్ద తీవ్ర గాయాలతో ఉన్న ఒక 51 ఏళ్ల మహిళను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని సంవత్సరాలు సాహు బైపోలార్ వ్యాధితో బాధపడుతున్నాడని, అతనికి స్కిజోఫ్రీనియా లక్షణాఉ కూడా ఉన్నాయని సాహు మాజీ భార్య లీ గోల్డ్‌స్టీన్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. తనకున్న వ్యాధి ఏమిటో అతనికి అర్థం కాదని, అతనికి మాటలు వినిపిస్తాయే తప్ప తన చుట్టూ ఏంజరుగుతోందో తెలుసుకోలేడని ఆమె చెప్పారు. తాను చాలా ఏళ్లుగా విడిగా ఉంటున్నట్లు ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News