- Advertisement -
కైరో : ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ, సామరస్య సాధన దిశలో ఈజిప్టు మరో ముందడుగు వేసింది. శుక్రవారం ఈజిప్టు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఒకటి ఇజ్రాయెల్‌కు బయలుదేరింది. హమాస్ ఇజ్రాయెల్ నడుమ కీలకమైన శాంతి ఒప్పందం దిశలో తాము మధ్యవర్తిత్వంలో ఉన్నామని, తమ ప్రయత్నాలు ఫలిస్తాయని విశ్వసిస్తున్నామని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.
ఈ ప్రాంతంలో తక్షణ శాంతిని తాము కోరుకుంటున్నామని, అయితే తమ దేశ సరిహద్దుల్లోని గాజా ప్రాంతపు రఫా సిటీపై ఇజ్రాయెల్ భీకర దాడులతో ఈ ప్రాంతపు సుస్థిరతకు భంగం వాటిల్లుతుందని, దీని వల్ల విపరీత అనంతర పర్యవసానాలు ఉంటాయని ఈజిప్టు హెచ్చరించింది. ఈజిప్టునకు చెందిన ఇంటలిజెన్స్ ఉన్నతాధికారి అబ్బాస్ కమెల్ ప్రతినిధి బృందానికి సారధ్యం వహిస్తున్నారు.
- Advertisement -