Monday, December 23, 2024

కాంగ్రెస్ పార్టీకి బండి సంజయ్ సవాల్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీకి మాజీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ మోసగించిందని ఆయన ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. తమ మేనిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీత అని చెప్పారు. హామీలు నిలబెట్టుకోలేదని బిఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద పెట్టారని బండి స్పష్టం చేశారు. మహిళల ఖాతాల్లో రూ. 2500 జమచేసినట్లు, ఆసరా పింఛన్లు రూ. 4వేలు ఇచ్చామని, విద్యార్థులకు భరోసా ఇచ్చామని నిరూపించాలి ఆయన డిమాండ్ చేశారు.

అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకోవడానికి తాను సిద్ధం అన్నారు. నిరూపించలేకపోతే మీరందరూ పోటీ నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. ఎల్లుండి వరకు నిరూపిస్తే నామినేషన్ విత్ డ్రా చేసుకుంటామని తెలిపారు. నిరూపించలేకపోతే 15 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకుంటుందా? అని బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News