Saturday, November 23, 2024

అసోచామ్ ఆధ్వర్యంలో ‘ప్రపంచ ఐపి దినోత్సవం’ సెషన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచ ఐపి దినోత్సవాన్ని పురస్కరించుకుని అసోచామ్ సెషన్ నిర్వహించింది. టీ-హబ్ సహకారంతో రెసొల్యూట్ 4ఐపి తోడ్పాతో మేధో సంపత్తి హక్కుల (ఐపిఆర్) స్థిరమైన పురోగతిని, ఎఐలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా కీలకపాత్రను పరిశోధించడానికి అసోచామ్ ఈ సదస్సును నిర్వహించింది. అసోచామ్ స్టేట్ హెడ్ ఏపీ, తెలంగాణా మచ్చా దినేష్ బాబు ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ, ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి మేధో సంపత్తిని ప్రభావితం చేసే వినూత్న విధానాలు, సహకారాన్ని అన్వేషించడానికి ఈ సెషన్ ఒక వేదికగా పనిచేసిందని అన్నారు.

ఈ సదస్సును ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సిటిఒ ప్రణవ గ్రూప్ కన్వీనర్, ఐటి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్యానెల్, అసోచామ్ తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, రాంబాబు బూరుగు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని డిపిఐఐటిలో ఐపిఆర్ చైర్‌ను నిర్వహిస్తున్న సీనియర్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ జి.బి. రెడి, టి- హబ్ సిఇఒ శ్రీనివాస్ మహంకాళి, ఐపిఆర్ నిపుణులు సెషన్‌ను ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News