Monday, December 23, 2024

హైదరాబాద్ వ్యక్తిని ముంచేసిన మోసగాళ్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ముంబై పోలీసులం, సిబిఐ అని చెప్పి మోసగాళ్లు ఓ 65 ఏళ్ల రిటైర్ వ్యక్తిని రూ. 35 లక్షల మేరకు శనివారం ముంచేశారు. మోసగాళ్ల నుంచి ఆ వ్యక్తికి కాల్ వచ్చింది. ఆధార్ కార్డుకు లింకయిన మీ మొబైల్ నుంచి అక్రమ అడ్వర్టయిజింగ్, వేధించే టెక్ట్స్ మెసేజీలు పబ్లిక్ కు వెళ్లయాని చెప్పారు. పైగా ఐపిసి సెక్షన్లు 67ఏ, 354ఏ, 499, 509 కింద కేసు నమోదు చేస్తామని బెదిరించారు.

ఆ తర్వాత వారు ఒరిజినల్ మొబైల్ నంబర్ ను బ్లాక్ చేయమని, వెంటనే ముంబై పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయమని కూడా ఆ మోసగాళ్లు అతడితో చెప్పారు. అయితే బాధితుడు తాను ఎలాంటి కేసులో లేనని, పైగా వారు పేర్కొన్న మొబైల్ నంబర్ తనది కాదని కూడా వారికి తెలిపాడు.

ఆ తర్వాత బాధితుడికి స్కయిప్ వీడియో కాల్ ఫేక్ సిబిఐ ప్రొఫైల్ నుంచి వచ్చింది. తాను అమాయకుడినని చెప్పినప్పటికీ, ఆ మోసగాళ్లు ఇంటరాగేషన్ కొనసాగించి, అతడి పేరును చెప్పబడిన క్రయిమ్ నుంచి తొలగించాలంటే తమకు సహకరించాలన్నారు. దానికి వారు నిజంగా సిబిఐ మనుషులేమో అనుకుని వివరాలన్నింటినీ ఆ మోసగాళ్లకు తెలిపాడు. ఆ తర్వాత ఆ మోసగాళ్లు దర్యాప్తు పూర్తయ్యే వరకు ఇల్లు వదిలి పోవద్దని, రూ. 34 లక్షలు సేవింగ్స్ నుంచి ప్రభుత్వ ఖాతాకు ఆర్టిజిఎస్ ద్వారా పంపాలని సూచించారు. పరిశోధన పూర్తయ్యాక మూడు నాలుగు రోజుల్లో ఆ మొత్తం తిరిగి రీఫండ్ చేస్తామని కూడా మోసగాళ్లు నమ్మబలికారు.  ఆ తర్వాత కూడా భార్య నగలు అమ్మి డబ్బులివ్వాలని మోసగాళ్లు అతడిపై ఒత్తిడి పెంచారు. ఇదేదో పెద్ద కుట్ర అని భావించిన ఆ వ్యక్తి ఫిర్యాదు దాఖలు చేశాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News