Monday, December 23, 2024

మోడీ ఫ్యాక్టరీకి ఇక మూతనే : ఖర్గే

- Advertisement -
- Advertisement -

మోడీ అబద్ధాల ఫ్యాక్టరీ ఇక మూసుకోవల్సి వస్తుందని, ఇది పనిచేయబోదని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ముస్లింలీగ్ మేనిఫెస్టోగా ఉందని మోడీ దుష్ప్రచారానికి దిగుతున్నారని ఖర్గే అసోంలోని కయకుచిలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఎదురుదాడికి దిగారు. ఎంతకాలం అసత్యాలు వల్లిస్తూ ఉంటారు. వీటికి కాలం చెల్లే రోజులు వచ్చాయని ఖర్గే తెలిపారు.

దేశంలో విద్యావంతులైన యువతరంలో 65 శాతం వరకూ నిరుద్యోగులుగా ఉన్నారని విమర్శించారు. ఈ లోక్‌సభ ఎన్నికలలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. బిజెపిని అడ్డుకుంటుంది. మోడీ బిజెపి పతనం అవుతుందని ఖర్గే తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ధరలు అదుపు, పేదలపై దృష్టి సారించడం జరుగుతుంది. పలు ప్రభుత్వ శాఖలలోని 30 లక్షల ఉద్యోగాల భర్తీ జరుగుతుందని చెప్పారు. ప్రధాని మోడీ అబద్ధాలకోర్ల దండు సర్దార్ అని వ్యాఖ్యానించారు. ఈ పది ఏండ్లలో పలు అసత్యాలు అందంగా ప్రచారం చేశాడని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News