- Advertisement -
అహ్మదాబాద్‌కు వెళ్లవలసిన ఇండిగో విమానం ల్యాండింగ్ గేర్ సమస్య కారణంగా శనివారం మధ్యాహ్నం దేశ రాజధానికి తిరిగి వచ్చిందని ఒక ప్రతినిధి తెలియజేశారు. 6ఇ129 నంబర్ విమానం శనివారం మధ్యాహ్నం సుమారు 2.40 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా దిగిందని, విమానంలో 170 మంది ఉన్నారని ఆ ప్రతినిధి తెలిపారు. విమానానికి ప్రస్తుతం అవసరమైన పరీక్షలు చేస్తున్నట్లు, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేసినట్లు ఇండిగో ప్రతినిధి ఒకరు తెలియజేశారు. ల్యాండిగ్ గేర్ సమస్య కారణంగా విమానం తిరిగి రావలసి వచ్చిందని, శనివారం రాత్రికి ఎమర్జన్సీ ప్రకటించడమైందని ఆ ప్రతినిధి తెలిపారు. సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్ గుర్తించినందున టేకాఫ్ తరువాత విమానం ఢిల్లీకి తిరిగి వచ్చిందని ఆ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
- Advertisement -