Wednesday, April 2, 2025

నార్సింగిలో రూ.10లక్షలు సీజ్

- Advertisement -
- Advertisement -

వాహనాల తనిఖీల్లో కారులో తరలిస్తున్న నగదును నార్సింగి పోలీసులు శనివారం సీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం…నార్సింగి ఇన్స్‌స్పెక్టర్ హరికృష్ణరెడ్డి ఆధ్వర్యంలో కోకపేటలోని గర్ బిల్డింగ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే కారులో వస్తున్న హైదరాబాద్‌కు చెందిన దరన్పాల్ అగర్వాల్‌ను ఆపి తనిఖీ చేయగా రూ.10లక్షల నగదు లభించింది.

వాటికి సంబంధించిన ఆధారాలు చూపించాల్సిందిగా కోరగా చూపించలేకపోయాడు. వెంటనే నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు సీజ్ చేసి రాజేంద్రనగర్ రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా కలెక్టర్ కార్యాలయంలో డిపాజిట్ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందని ఎవరైనా రూ. 50 వేల కన్నా ఎక్కువ ఎవరన్నా తీసుకెళ్తే అట్టి రూపాయలను సీజ్ చేస్తామని నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణరెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News