మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్టు అయ్యారు. ఆదివారం ఉదయం ముంబై పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సైబర్ విభాగానికి చెందిన సిట్ సాహిల్ ఛత్తీస్‌గఢ్‌లో కస్టడీలోకి తీసుకుంది. సాహిల్ ఖాన్ ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించగా కోర్టు తిరస్కరించింది.
ఈ కేసులో సిట్ 2023 డిసెంబర్ లోనే సాహిల్ ఖాన్ కు సమన్లు జారీ చేయగా ఆయన విచారణకు హాజరు కాలేదు. అంతేకాకుండా ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. తాను సెలబ్రేటీ కావడంతో కేవలం యాప్ కు బ్రాండ్ ప్రమోటర్‌గా పనిచేశానని తెలిపారు. యాప్ ద్వారా జరిగే కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. కానీ మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా దాదాపు రూ.15,000 కోట్లు అవినీతి జరిగినట్లు గుర్తించిన సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది.