Monday, December 23, 2024

ఆప్ ఎమ్‌ఎల్‌ఎ అమానతుల్లా ఖాన్‌కు ఈడీ మళ్లీ నోటీస్‌లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మనీలాండరింగ్‌కేసులో ఆప్ ఎమ్‌ఎల్‌ఎ అమానతుల్లా ఖాన్‌కు ఈనెల 29న విచారణకు రావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి )మరోసారి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌గా ఉన్న కాలంలో జరిగిన నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో గత వారం ఈడీ అధికారులు ఆయనను 13 గంటల పాటు విచారించిన తరువాత అదుపులోకి తీసుకున్నారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆయనకు శనివారం బెయిల్ మంజూరు చేసింది.

రూ.న 15 వేల పూచీకత్తుతో బెయిల్ ఇస్తున్నట్టు తెలిపింది. ఇదిలా ఉండగా ఆయన జైలు నుంచి విడుదల కాగానే మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇప్పటికే ఆయనపై ఏసీపీ, సీబిఐ, రెండు ఎఫ్‌ఐఆర్‌లను దాఖలు చేశాయి. చట్టవ్యతిరేకంగా ఇప్పటివరకు 32 మందిని నియమించారంటూ ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది. గతంలో కూడా అక్రమ నియామకాలకు పాల్పడ్డారని అనుమానిస్తూ అమానుతుల్లాను ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News