Monday, January 20, 2025

బేబీ ఈజ్ ఆన్ ది వే…. ధోనీకి శుభాకాంక్షలు తెలుపుతున్న అభిమానులు

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌పై చెన్నై సూపర్ కింగ్స్ గెలుపొందింది. తొలుత చెన్నై బ్యాటింగ్ చేసి హైదరాబాద్ ముందు 213 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. హైదరాబాద్ జట్టు 134 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో చెన్నై జట్టు 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మహేంద్ర సింగ్ ధోనీ సతీమణి సాక్షి సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు వైరల్‌గా మారింది. ‘ధోనీ ప్లీజ్ ఇవాళ మ్యాచ్‌ను త్వరగా ముగించాలి, బేబీఈజ్ ఆన్ ది వే, కాబోయే అత్తగా నా అభ్యర్థన ఇదే’ అని సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. ఈ పోస్టును ధోనీ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు కామెంట్లు చేస్తున్నారు. ధోనీ మామ కాబోతున్నరంటూ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News