Tuesday, December 24, 2024

అమిత్ షా నకిలీ వీడియో… అస్సోం కాంగ్రెస్ కార్యకర్త అరెస్ట్

- Advertisement -
- Advertisement -

గువాహటి: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నకిలీ వీడియోను ప్రసారం చేశాడన్న ఆరోపణపై అస్సోం కాంగ్రెస్ కార్యకర్త రీటామ్ సింగ్ సోమవారం అరెస్ట అయినట్టు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సోమవారం వెల్లడించారు. అరెస్ట్ అయిన 31 ఏళ్ల రీటామ్ సింగ్ వార్ రూమ్ కో ఆర్డినేటర్‌గా కాంగ్రెస్ పార్టీ తోను, పార్టీ కార్యకలాపాల తోను సంబంధం ఉందని ముఖ్యమంత్రి బిశ్వశర్మ పేర్కొన్నారు. గువాహటి లోక్‌సభ స్థానం బిజులీ కలిత మేధీ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడానికి వచ్చిన అమిత్‌షా అస్సోం రాష్ట్ర రాజధానిలో ఉండగానే ఈ అరెస్టు జరగడం విశేషం.

వక్రీకరించి, ప్రేరేపించిన వీడియోను ప్రసారం చేసినట్టు అందిన ఫిర్యాదుపై పంబజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు దాఖలైందని అస్సోం పోలీస్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ప్రణబ్ జ్యోతి గోస్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐపిసి సెక్షన్లు 153ఎ, 171జి, 505(1)(బి), సైబర్ ఉగ్రవాదం ఐటి యాక్టు సెక్షన్ 66 ఎఫ్ కింద కేసు నమోదైందని గోస్వామి చెప్పారు. నిందితుని దగ్గర నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఒక లాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. అయితే దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఈ నకిలీ వీడియా వ్యవహారం గురించి పార్టీకేమీ తెలియదని, నిందితుడు తన వ్యక్తిగత ఉద్దేశంతో వీడియోను ప్రసారం చేసి ఉంటాడని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News