Monday, December 23, 2024

నోటీసులకు భయపడేది లేదు: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ పోలీసులకు తాను భయపడేది లేదని, బిజెపితో పోరాడే వారికే అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని, సోషల్ మీడియాలో బిజెపిని ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రినైన తనకు, గాంధీ భవన్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈడీ, సిబిఐ, ఐటీ అధికారులు వస్తున్నారని సిఎం మండిపడ్డారు. తనకు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు వచ్చారని, మోడీ ఇప్పటి వరకు విపక్షాలపై సిబిఐ, ఈడీని ప్రయోగించారన్నారు.

ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఢిల్లీ పోలీసులను బిజెపి ప్రయోగిస్తుందని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు సోమవారం సిఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సోషల్ మీడియా నాయకులకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సిఎం రేవంత్‌రెడ్డి కర్ణాటకలోని ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఈ సందర్భంగా తాజా నోటీసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ణాటకలోని ఎన్నికల ప్రచారంలో ఘాటుగా స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News