Thursday, December 19, 2024

మంగళవారం రాశి ఫలాలు(30-04-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అధిక ధన వ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తున్నప్పటికీ, మీ ఆలోచనలు కార్యరూపంలో సత్ఫలితాలను ఇస్తాయి.

వృషభం – లిఖిత పూర్వకంగా ఒప్పందాలను కుదుర్చుకొని లాభపడుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండడం వలన ఎన్ని ఒత్తిడిలు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందడుగు వేయగలుగుతారు.

మిథునం – ఉన్నత స్థాయి వర్గం లోని వారికి మంచి సలహాలను అందిస్తారు. వారి ద్వారా మంచి సలహాదారునిగా పేరు పొందుతారు. అన్య భాషలు నేర్చుకోవడానికి గాను ఉత్సుకతను చూపుతారు.

కర్కాటకం – పనులు సాఫీగా సాగుతాయి. స్వప్రయోజనాల కోసం బాగా శ్రమిస్తారు. మహోన్నతమైన వ్యక్తులుగా మీరు భావించిన వారి అసలు స్వరూపం తెలిసి వస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

సింహం – అర్థంలేని వివాదాలు కోపతాపాలతో కాలహరణం కానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు.  భాగస్వాముల నిజాయితీ మీద అపనమ్మకం ఏర్పడుతుంది.ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు.

కన్య – బాధ్యతల నిర్వహణకు వెనకడుగు వేయరు. మరమ్మత్తులకు సంబంధించిన ధన వ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తుంది. అనుకూలమైన ఆనందకరమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు.

తుల – అనుకున్న పనులు కష్టం మీద సానుకూల పడతాయి. ప్రతిపని నిదానంగా నింపాదిగా సాగుతుంది. అయితే ఇందువలన నష్టపోయే సూచనలు మాత్రం ఏమీ లేవు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు.

వృశ్చికం – మీ వ్యతిరేకపక్షం వారిని నేడు ముఖాముఖి ఎదుర్కొనవలసి వస్తుంది.ప్రత్యేకమైన కారణాలేవి లేకపోయినప్పటికీ వేళ్లకి నిద్రాహారాలు కరువవుతాయి. సంతాన విషయమై ప్రత్యేక శ్రద్ధ కనబరచాల్సి వస్తుంది

ధనుస్సు – పెట్టుబడులు ప్రధాన ప్రస్తావనాంశాలవుతాయి పొదుపు పథకాలను ఆశించిన స్థాయిలో కాకపోయినా కొంతవరకు పాటించగలుగుతారు. మీరు అడిగే సెలవులు కార్యాలయంలో మంజూరు కావు కొంత అసంతృప్తి ఏర్పడుతుంది.

మకరం – సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. దూరప్రాంత విషయ  వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి లెక్కలు పద్దులు పరిశీలించుకోవడం వలన లాభపడతారు. ఆరోగ్యాన్ని కొంత నిర్లక్ష్యం చేస్తారు

కుంభం – బ్యాంకు రుణాలు మంజూరవడంలో జాప్యం  చోటు చేసుకుంటుంది. మీకు లభించవలసిన సౌకర్యాలను సాధించుకోవడానికి గాను అమితంగా కృషిచేయవలసి వస్తుంది. నూతన ఉద్యోగాన్వేషణ.

మీనం – దీర్ఘకాలికమైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకునేటప్పుడు నిష్ణాతుల సలహాలను పరిగణలోకి తీసుకోండి. ఏకపక్షం అభిప్రాయాలు ఏకపక్ష నిర్ణయాలు లాభించవు. స్వల్ప ధన లాభం గోచరిస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News