Thursday, January 2, 2025

సన్ రైజర్స్ కు వరుస షాక్ లు

- Advertisement -
- Advertisement -

వెంటాడుతున్న ఛేజింగ్ వైఫల్యాలు

మన తెలంగాణ/ హైదరాబాద్: ఐపిఎల్ సీజన్17లో అద్భుత ఆటతో అలరిస్తున్న సన్‌రైజర్స్‌కు వరుసగా ఎదురైన రెండు ఓటములు షాక్‌కు గురి చేశాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌లతో జరిగిన మ్యాచుల్లో హైదరాబాద్ పరాజయం చవిచూసింది. ఈ ఓటములతో సన్‌రైజర్స్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అసాధారణ బ్యాటింగ్‌తో అదరగొడుతున్న హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ తక్కువ స్కోరుకే పరిమితమైంది. సొంత గడ్డపై బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో జట్టు విఫలమైంది. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఐపిఎల్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్‌క్రమ్ తదితరులు కొన్ని మ్యాచ్‌లుగా ఆశించిన స్థాయిలో బ్యాట్‌ను ఝులిపించలేక పోతున్నారు. వీరి వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. హైదరాబాద్ సాధించిన ఐదు విజయాల్లో ఈ నలుగురే చాలా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే బెంగళూరు, చెన్నైలతో జరిగిన మ్యాచుల్లో ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు శుభారంభం అందించలేక పోయారు. వీరి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో తర్వాత వచ్చిన బ్యాటర్లు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోయారు.

బెంగళూరుపై హెడ్ (1), మార్‌క్రమ్ (7), క్లాసెన్ (7) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. అభిషేక్ ధాటిగా ఆడినా 31 పరుగులకే వెనుదిరిగాడు. నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్ కూడా విఫలమయ్యారు. కీలక బ్యాటర్లందరూ విఫలం కావడంతో బెంగళూరు మ్యాచ్‌లో హైదరాబాద్‌కు ఇబ్బందులు తప్పలేదు. షాబాజ్ అహ్మద్ (40), కెప్టెన్ కమిన్స్ (31) కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కూడా హైదరాబాద్‌ను బ్యాటింగ్ సమస్య వెంటాడింది. ఈసారి కూడా కీలక ఆటగాళ్లు తక్కువ స్కోరుకే ఔటయ్యారు. దీంతో హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో 78 పరుగుల భారీ తేతడాతో పరాజయం చూసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు భారీ స్కోరును సాధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (98), డారిల్ మిఛెల్ (52), శివమ్ దూబె (39) విధ్వంసక బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ ప్రత్యర్థి జట్టు బౌలర్ల ధాటికి తట్టుకోలేక 18.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు హెడ్ (13), అభిషేక్ శర్మ (15) మరోసారి విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన అన్మోల్‌ప్రీత్ సింగ్ (0) ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. క్లాసెన్ (20), మార్‌క్రమ్ (32), నితీష్ రెడ్డి (15), సమద్ (19) పెద్దగా ప్రభావం చూపలేక పోయారు. దీంతో హైదరాబాద్‌కు వరుసగా రెండో ఓటమి తప్పలేదు.

తీరు మారాల్సిందే..

వరుస ఓటముల నేపథ్యంలో సన్‌రైజర్స్ తన ఆట తీరును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా ముందుకు వెళ్లక తప్పదు. ఓపెనర్లు అభిషేక్, హెడ్‌లు తమ విధ్వంసక బ్యాటింగ్‌ను కొనసాగించాలి. అంతేగాక మార్‌క్రమ్, క్లాసెన్, నితీష్, సమద్, షాబాజ్ తదితరులు మెరుగైన ఇన్నింగ్స్‌లను ఆడాలి. బౌలర్లు కూడా సత్తా చాటక తప్పదు. బ్యాటర్లు, బౌలర్లు తమ వంతు సహకారం అందిస్తేనే రానున్న మ్యాచుల్లో సన్‌రైజర్స్‌కు గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయి. మరోవైపు నాకౌట్ రేసులో నిలువాలంటే రానున్న మ్యాచుల్లో వరుస విజయాలు సాధించాల్సిన పరిస్థితి సన్‌రైజర్స్‌కు నెలకొంది. ఇందులో ఎంతవరకు సఫలమవుతుందో వేచి చూడాల్సిందే.ఒ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News