Sunday, December 22, 2024

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 1 1 మంది మృతి చెందిన సంఘటన కేరళ, బిహార్ రాష్ట్రాలలో జరిగింది. కేరళలోని కన్నూరు ప్రాంతం పునచెర్రీ గ్రామ శివారులో కారు, లారీ ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.

బిహార్‌లోని భగల్‌పూర్ ప్రాంతం అమపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ట్రక్కు టైర్ పేలడంతో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వివాహ వేడుకుల నిమిత్తం కారులో ధపారి నుంచి కహల్‌గాం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News