Sunday, November 24, 2024

రాహిల్ ను అరెస్టు చేయొద్దు… హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో మాజీ ఎంఎల్ఎ షకిల్ కుమారుడు రాహిల్ కు హైకోర్టులో ఊరట లభించింది. రాహిల్ కు రెండు వారాల పాటు అరెస్టు చేయవద్దని హైకోర్టు స్టే విధించింది. రెండు వారాల తర్వాత విచారణ ఎదుర్కోవాల్సినదేనని జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ స్పష్టం చేసింది. రాహిల్ కు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాల్ చేస్తూ జూబ్లీహిల్స్ పోలీసులు అపీల్ కు వెళ్లారు. దీంతో రాహిల్ తరపు న్యాయవాది హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు రెండు వారాల పాటు అరెస్టు చేయవద్దని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

రెండు సంవత్సరాల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక చిన్నారి దుర్మరణం చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కారుపై స్టిక్కర్ ఆధారంగా మాజీ ఎంఎల్‌ఎ షకీల్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగినప్పుడు కారు షకీల్ కుమారుడు రాహిల్, స్నేహితులు ఆఫ్నాన్, మాజీ ఉన్నట్లు గుర్తించారు. అప్పట్లో కారు తానే నడిపానని ఆఫ్నాన్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మళ్లీ కేసు రీఓపెన్ చేసి దర్యాప్తు చేయగా ఎ1గా రాహిల్‌ను పోలీసులు గుర్తించారు. దీనిపై రాహిల్ హైకోర్టు ఆశ్రయించడంతో ఈ నెల 18 వరకు అరెస్టు చేయవద్దంటూ కోర్టు ఆదేశించడంతో చంచలగూడ జైలు నుంచి రాహిల్ విడదలయ్యారు. రాహిల్ బెయిల్‌పై పోలీసులు హైకోర్టులో అపీల్ చేయడంతో రెండు వారాల పాటు అరెస్టు చేయొద్దంటూ కోర్టు మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News