Monday, December 23, 2024

మొబైల్ ఇవ్వలేదని కత్తితో పొడిచి చంపారు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మొబైల్ ఫోన్ ఇవ్వలేదని ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన సంఘటన హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సనావుల్లా(24) అనే వ్యక్తి పివి ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 65 వద్ద చిల్లర వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సనావుల్లాను మొబైల్ ఇవ్వాలని అడిగారు. అతడు ఇవ్వకపోవడంతో గొడవ జరిగింది. వెంటనే కత్తి తీసుకొని సనావుల్లా ఛాతీపై పొడిచారు. వెంటనే ఇద్దరు బైక్‌పై పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు సిసి టివి దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News