Friday, April 11, 2025

కెసిఆర్కు బిగ్ షాక్.. కాంగ్రెస్లో చేరిన ఇంద్రకరణ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ కీలక నేత ఇంద్రకరణ్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్దిసేపటిక్రితం ఆయన గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అంతకుముందు, బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఇంద్రకరణ్ రెడ్డికి రాజీనామా చేశారు.

తన రాజీనామా లేఖను అధినేత కేసీఆర్‌కు పంపించారు. బీఆర్ఎస్ సర్కార్ లో ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా పనిచేశారు. కాగా, ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News