Friday, December 20, 2024

తాండూరు ఎస్‌ఐ సస్పెండ్

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: తాండూరు ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు పడింది. పిడిఎస్ రైస్ అక్రమ దందా కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు అలసత్వం వహించడంతో ఎస్‌ఐ కె జగదీష్‌ను ఐజి ఎవి రంగనాథ్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణతో పాటు నేర సమీక్షకు సంబందించి రామగుండ కమిషనరేట్ కార్యాలయానికి ఐజి ఎవి రంగనాథ్ వచ్చాడు. పిడిఎస్ రైస్ కేసులపై రంగనాథ్ సమీక్ష జరిపారు. ఏప్రిల్ 20న తాండూరు పోలీస్ స్టేషన్‌లో పట్టుబడిన పిడిఎస్ బియ్యం అక్రమ దందా కేసుపై సమీక్ష నిర్వహించాడు. ఈ కేసు విషయంలో ఎస్‌ఐ జగదీష్ అలసత్వం వహించడంతో పాటు పలు ఆరోపణలు రావడంతో సదరు ఎస్‌ఐని సస్పెండ్ చేస్తున్నట్లు ఐజి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News