- Advertisement -
హైదరాబాద్: క్రిష్ దర్శకత్వంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమా టీజర్ వచ్చేసింది. దీంతో పవన్ అభిమానులకు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ధర్మం కోసం యుద్ధం అంటూ సాగే ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ ట్రైలర్‌లో పవన్ నటన బాగుండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ బందిపోటుగా తన నటనతో విశ్వరూపం చూపించనున్నాడు. మొఘలాయిలు, కుతుబ్ షాహీలు కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎపి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. పవన్ తీరక లేకుండా ప్రచారం చేస్తున్నాడు. హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ బ్రేక్ ఇచ్చి రాజకీయాలపై ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు. పార్లమెంట్, ఎపి అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత ఈ సినిమా షూటింగ్ లో ఆయన పాల్గొననున్నారు.
- Advertisement -