హైదరాబాద్: కెరీర్‌లో చిన్న చిన్న తప్పులే అధఃపాతాళానికి తొక్కిపడేస్తాయి. కెరీర్‌లో తప్పులు తెలుసుకొని ముందుకు వెళ్తే సక్సెస్ అవుతారు లేకపోతే ఫీల్డ్‌లో లేకుండాపోతారు. హీరోయిన్ అనుష్క శెట్టి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో నటిగా మెరిసింది. సూపర్ సినిమాతో ఆమె టాలీవుడ్‌లోకి రంగ ప్రవేశం చేశారు. ప్రభాస్‌కు జోడిగా మిర్చి, బిల్లా, బాహుబలి1, బాహుబలి2 పాటు నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. లేడీ ఓరియెంటెడ్ అరుంధతి చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. బాహుబలి సినిమాతో ఆమె పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది. తరువాత ఒక్క మగాడు సినిమాలో బాలకృష్ణతో అనుష్క నటించారు.
ఆ సినిమా బాక్స్‌ఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆమె కెరీర్‌పై దెబ్బపడింది. వెంటనే రిస్క్ తీసుకొని సైజ్ జీరో సినిమాకు ఓకే చెప్పేసింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో అనుష్క కెరీర్ పూర్తిగా దెబ్బతింది. అప్పటికే ఈ సినిమా కోసం బరువు పెరగడంతో ఆమెలో నాజుకుతనం కనిపించకుండాపోయింది. ఆమె రెండు సినిమాలలో నటించడంతో ఆమె కెరీర్ పూర్తిగా దెబ్బతిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. బాహుబలి తరువాత ఆమె కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే సక్సెస్ సాధించేదని ఆమె అభిమానులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని అభిమానులు కోరుతున్నారు.