Friday, November 22, 2024

మోడీని క్షమాపణ చెప్పమన్న రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

శివమొగ్గ: హస్సన్ నియోజకవర్గం జెడి(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవన్న 400 మంది మహిళలను బలాత్కరించి వారి వీడియోలను రికార్డు చేశాడని, అతడికి ఓటేయమని అడిగిన ప్రధాని క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు.

ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ ‘మాస్ రేపిస్ట్’ ప్రజ్వల్ రేవన్నకు ఓటేయమని అడిగినందుకు భారత మహిళలకు మోడీ క్షమాపణలు కోరాలని అన్నారు. ప్రజ్వల్ రేవన్న నేరాలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను కర్నాటక ప్రభుత్వం ఏర్పాటు చేసి కేసు విచారణ జరుపుతోందన్న సంగతి తెలిసిందే.

‘‘ప్రధాని మోడీ భారత దేశ తల్లులు, సోదరీమణులకు క్షమాపణలు చెప్పాలి. ప్రజ్వల్ రేవన్న 400 మంది మహిళలను బలాత్కరించడమేకాక, వీడియోలు కూడా చేశాడు. ఇది కేవలం సెక్స్ స్కాండల్ మాత్రమే కాదు, మాస్ రేప్’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News