Monday, December 23, 2024

ప్రజ్వల్ రేవణ్ణపై లుకవుట్ నోటీసు జారీ

- Advertisement -
- Advertisement -

కలబురగి(కర్నాటక): మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్‌కు చెందిన జెడిఎస్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణపై లుకవుట్ నోటీసు జారీచేసినట్లు కర్నాటక హోం మంత్రి జి పరమేశ్వర గురువారం తెలిపారు. తాను విదేశాలలో ఉన్నందున సిట్ ఎదుట హాజరు కావడానికి మరో వారం రోజుల గడువు కావాలని ప్రజ్వల్ కోరడంపై స్పందిస్తూ 24 గంటలకు మించి సమయం ఇచ్చే నిబంధన ఏదీ లేదని విలేకరులతో మాట్లాడుతూ ఆయన స్పష్టం చేశారు.

ప్రజ్వల్ విదేశాలకు వెళ్లిపోయినట్లు తెలిసిన వెంటనే లుకవుట్ నోటీసు జారీచేయడం జరిగిందని ఆయన చెప్పారు. లుకవుట్ నోటీసు గురించి పోర్టులు, విమానాశ్రయాలకు తెలియచేసినట్లు ఆయన చెప్పారు. మరో బాధితురాలు కూడా ముందుకు వచ్చి ప్రజ్వల్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినట్లు హోం మంత్రి వెల్లడించారు. బాధితురాలి వాంగ్మూలాన్ని పోటీసులు నమోదు చేశారని, ఈలోగా మరో బాధితురాలు కూడా ప్రజ్వల్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. ఆమె గురించి వివరాలు వెల్లడించలేనని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News