Sunday, November 3, 2024

గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. అమెరికా పోలీస్‌ల వెల్లడి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా లోని కాలిఫోర్నియాలో భారత్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీస్‌లు ఖండించారు. వాస్తవానికి ఆ సంఘటనలో చనిపోయిన వ్యక్తి వివరాలను గుర్తించిన తరువాత ఈ ప్రకటన చేశారు. అమెరికా లోని హోల్ట్ అవెన్యూలో మంగళవారం సాయంత్రం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అతడు కెనడా కేంద్రంగా పనిచేసే గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్‌గా స్థానిక మీడియా పేర్కొంది. చివరికి ఫ్రెస్నో పోలీస్‌లు రంగం లోకి దిగి దర్యాప్తు చేపట్టారు. మృతుడు గోల్డీబ్రార్ కాదని, లెఫ్టినెంట్ విలియం జే డూలే వెల్లడించారు.

“ మీరు ఆన్‌లైన్‌లో ప్రచారం నమ్మి మృతుడు గోల్డీబ్రార్ అనుకుంటే కచ్చితంగా తప్పే. అది పూర్తి అవాస్తవం. మా డిపార్ట్‌మెంట్‌కు ప్రపంచం నలుమూలల నుంచి ఎంక్వైరీలు వస్తున్నాయి. అసలు ఇలాంటి వదంతులు ఎలా మొదలయ్యాయో తెలియదు. ఈ కాల్పుల ఘటనలో మరణించింది 37 ఏళ్ల జేవియర్ గాల్డె ” అని వెల్లడించారు. గోల్డీబ్రార్‌గా ప్రచారంలో ఉన్న సతీందర్ సింగ్ భారత్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అతడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో అత్యంత కీలకమైన సభ్యుడు. 2022 లో జరిగిన సిద్ధూ మూసేవాల హత్య కేసులో ఒక్కసారిగా ఇతడి పేరు మార్మోగింది.

మరోవైపు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపైకి కాల్పులు జరిపిన ఘటనలో కూడా గోల్డీ బ్రార్ పేరు వినిపించింది. ఈ కేసులో అరెస్టైన నిందితుల్లో ఒకరు నిన్ననే పోలీస్ కస్టడీలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. నిందితులకు ఆయుధాలు సరఫరా చేసినట్టు భావిస్తున్న అనూజ్ తపన్ అనే వ్యక్తిని గత నెల 26న పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం అతడు లాకప్ గదిలో ఉన్న మరుగుదొడ్డిలో దుప్పటితో ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించినట్టు అధికారులు తెలిపారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News