Monday, November 25, 2024

ఆటో ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఆటో ప్రయాణికులను దోచుకుంటున్న నలుగురు ముఠా సభ్యులను మీర్‌చౌక్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మూడు మొబైల్ ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….నగరంలోని చాంద్రాయణగుట్టకు చెందిన అబ్దుల్ ఖాజా అలియాస్ చోట ఖాజా ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కంచన్‌బాగ్‌కు చెందిన మహ్మద్ ఇంతియాజ్ అలియాస్ ఇంతియాజ్, ఫతేషా నగర్‌కు చెందిన ఎండి నవాజ్ అలియాస్ నవాజ్ అలియాస్ బాబులాల్, షాహిన్ నగర్‌కు చెందిన గులాం హసన్ అలియాస్ చాక్లెట్ కలిసి ప్రయాణికులను దోచుకుంటున్నారు. అబ్దుల్ ఖాజాపై ఐదు కేసులు, ఎండి నవాజ్‌పై మూడు కేసులు ఉన్నాయి. కొత్తగూడెంకు చెందిన మహ్మద్ అబ్దుల్ జలీల్ వ్యాపారం చేస్తున్నాడు. బాధితుడు గత నెల 25వ తేదీన రాత్రి 11.35 గంటలకు నాయపూల్ ఎక్స్ రోడ్డు వద్ద ఎంజిబిఎస్‌కు వెళ్లేందుకు వేచి ఉన్నాడు.

అదే సమయంలో ఆటో రావడంతో అందులో ఎక్కాడు, అప్పటికే అందులో ఇద్దరు వ్యక్తులు వెనుక సీటులో కూర్చుని ఉన్నారు. కొంత దూరం వెళ్లిన తర్వాత బాధితుడిని డ్రైవర్ ముందు సీటులో కూర్చోమని చెప్పాడు. దీంతో ముందకు వచ్చిన కూర్చున్న మహ్మద్ అబ్దుల్ జలీల్ జేబులో చూసుకునే సరికి మొబైల్ ఫోన్ కన్పించలేదు. ఆటో వెనుక సీట్లో కూర్చున్న వారిపై అనుమానం ఉన్నా భయంతో వారిని ప్రశ్నించలేదు. తర్వాత ఎంజిబిఎస్ నుంచి కొత్తంగూడెంకు వెళ్లిపోయాడు. బ్యాంక్ నుంచి రూ.20,000 డ్రా చేసుకున్నట్లు మెసేజ్ రావడంతో షాక్ గురయ్యాడు. వెంటనే బాధితుడు కొత్తగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News