Saturday, November 23, 2024

4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు తరలింపు

- Advertisement -
- Advertisement -

ఎపిలోని అనంతపురం జిల్లా పామిడి వద్ద 4 కంటైనర్ల కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. కొచ్చి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్లను ముందస్తు సమాచారంతో పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఒక్కో కంటైనర్‌లో రూ.500 కోట్లు ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు, మొత్తం 4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు ఉన్నాయని వెల్లడించారు. పూర్తి రికార్డులు పరిశీలించిన అనంతరం, కొచ్చి ఆర్‌బిఐ నుంచి హైదరాబాద్ ఆర్‌బిఐకి కంటైనర్లు వెళ్తున్నాయని స్పష్టం చేశారు. ఎన్నికల తనిఖీల్లో భాగంగా అనంతపురం జిల్లా జాతీయ రహదారిపై పామిడి సిఐ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో పోలీస్ స్టిక్కరింగ్‌తో వెళ్తున్న 4 కంటైనర్లను గుర్తించిన పోలీ సులు అనుమానం వచ్చి వాటిని ఆపారు. కంటైనర్‌తో వస్తున్న సిబ్బందిని ప్రశ్నించగా, నాలుగు కంటైనర్లలో రూ.2000 కోట్లు ఉన్నట్లు చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు తరలిస్తుండటంతో వెంటనే స్థానిక పోలీసులు, జిల్లా కలెక్టర్‌తో పాటుగా ఎన్నికల అధికారులు, ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు సమాచారం అందించారు.

అక్కడికి చేరుకున్న అధికారులు, డబ్బు కేరళ రాష్ట్రంలోని కొచ్చి ఆర్‌బిఐ నుంచి హైదరాబాద్‌లోని ఆర్‌బిఐకు వెళ్తున్నట్లుగా గుర్తించారు. ఇందులో రూ.500 కోట్లు ఐసిఐసిఐ బ్యాంకు, రూ.500 కోట్లు ఐడిబిఐ బ్యాంకు, మరో రూ.1000 కోట్లు ఫెడరల్ బ్యాంకుకు చెందినవిగా పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం డబ్బుకు సంబంధించి సరైన పత్రాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ ఉత్తర్వులతో వెళుతున్నట్లు రికార్డులు పరిశీలించి, ఆ కంటైనర్లను వదిలేశారు. ‘అనంతపురం జిల్లా పామిడి వద్ద 4 కంటైనర్లలో కరెన్సీని గుర్తిం చాం. ఒక్కో కంటైనర్‌లో రూ.5 వందల కోట్లు ఉన్నట్టుగా గుర్తించాం. మొత్తం 4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు ఉన్నాయి. పూర్తి రికార్డులు పరిశీలించాం. పై అధికారులకు సమాచారం ఇచ్చాం. కొచ్చి ఆర్‌బిఐ నుంచి హైదరాబాద్ ఆర్‌బిఐకి కంటైనర్లు వెళ్తున్నాయి. ఈ డబ్బులు ఆర్‌బిఐకి చెందినవి. అందుకు సంబంధించి పూర్తి పత్రాలు ఉన్నాయి. సరైన పత్రాలు ఉండటంతో ఆ కంటైనర్లను వదిలిపెట్టాం’మని పామిడి సిఐ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News