- Advertisement -
రెండు వారాల క్రితం భారీ వర్షానికి చిగురుటాకులా వణికిపోయిన దుబాయ్‌తోపాటు ఇతర యునైటెడ్ ఎమిరేట్స్ నగరాలను గురువారం మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి అనేక అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. కాగా..వర్షాల కారణంగా ఉత్పన్నమయ్యే పరిస్థితిని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నట్లు జాతీయ అత్యవసర సంక్షోభ, విపత్తు నిర్వహణ సంస్థ బుధవారం ప్రకటించింది.
గత నెలలో కురిసిన కుండపోత వర్షంతో పోలిస్తే తాజా వర్షాల తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సంస్థ హె,్చరించింది. ఏప్రిల్ 14-15 తేదీలలో కురిసిన భారీ వర్షానికి యుఎఇ వణికిపోయింది. 1949 తర్వాత ఇంతటి భారీ స్థాయిలో దుబాయ్‌లో వర్షం పడడం ఇదే మొదటిసారి. యుఎఇ వ్యాప్తంగా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో గురువారం దుబాయ్ విమానాశ్రయంలో విమాన సర్వీసులన్నిటినీ రద్దు చేశారు.
- Advertisement -