Friday, December 20, 2024

బంగ్లాదేశ్ అధికారులకు భారత్ శిక్షణ

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్‌కు చెందిన 1,500 మంది అధికారులకు భారతదేశం వచ్చే ఐదేళ్లలో శిక్షణ ఇస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒక్కరు గురువారం వెల్లడించారు. అక్కడి బ్యూరోక్రాట్ల పనితీరు సమీక్ష, తగు మెళకువలు. సుపరిపాలన దిశలో వారికి తర్ఫీదువంటివి ఈ ఐదేండ్ల కార్యక్రమంలో భాగంగా ఉంటాయని వివరించారు. ఇప్పటికే ఈ విషయంలో ఉన్న పరస్పర ఒప్పందం మరో ఐదేండ్లు పొడిగించే దిశలో ఇరుపక్షాల నడుమ త్వరలోనే ఎంఒయులపై సంతకాలు జరుగుతాయి.

గడిచిన నెలలో భారతదేశానికి చెందిన పరిపాలనా సంస్కరణలు , ప్రజా సమస్యల విభాగం సెక్రెటరీ వి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓ ఉన్నత స్థాయి బృందం బంగ్లాదేశ్‌లో పర్యటించింది. అప్పుడు బ్యూరోక్రట్లకు మరో ఐదేండ్ల శిక్షణ విషయం చర్చకు వచ్చింది. ఇంతకు ముందటి ఒప్పందం పునరుద్ధరణ దిశలో అడుగు వేశారని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News