Friday, January 3, 2025

‘పాంచ్ న్యాయ్… పచ్చీస్ గ్యారంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాంచ్ న్యాయ్… పచ్చీస్ గ్యారంటీలో భాగంగా మేనిఫెస్టో తయారు చేశామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ తెలిపారు. తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. మేనిఫెస్టో తెలుగు ప్రతిని దీపాదాస్ మున్షీ విడుదల చేశారు. ఐదు న్యాయాలు, తెలంగాణ ప్రత్యేక హామీ పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా మున్షీ మాట్లాడారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని, అన్ని వర్గాలతో మాట్లాడి మేనిఫెస్టో తయారు చేశామని మున్షీ వివరించారు. మేనిఫెస్టో కమిటీలో ఉన్న అందరికీ అభినందనలు తెలిపారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేరలేదని, బిజెపి నేతల నినాదాలు చూసి ప్రజలు భయపడుతున్నారని, సిబిఐ, ఇడి, ఐటి దాడులతో విపక్ష నేతలు అందోళనకు గురవుతున్నారని ధ్వజమెత్తారు. న్యాయం కొరుతూ రాహుల్ జోడో యాత్ర చేపట్టారని ఆమె ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Congress Manifesto Panch Nyay and Pacchis Guarantees

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News