బర్ధమాన్: ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అనేక ర్యాలీలు, రోడ్ షోలు జార్ఖండ్ లో నిర్వహించనున్నారు. కాగా బర్ధమాన్ దుర్గాపూర్ సీటు నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి దిలీప్ ఘోష్ తరఫున ప్రధాని ప్రచారం చేశారు. పశ్చిమ బెంగాల్ లోని టిఎంసి రామ మందిరానికి అభ్యంతరాలు తెలుపుతోందని, రామ నవమి శోభా యాత్రలపై, జై శ్రీరామ్ అని నినదించడంపై అభ్యంతరాలు తెలుపుతోందన్నారు. హిందువులను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రెండో శ్రేణి పౌరుల మాదిరిగా చూస్తోందని అన్నారు.
ఇదిలావుండగా రాహుల్ గాంధీ రాయ బరేలి నుంచి, గాంధీ కుటుంబానికి దగ్గరి వాడు కిశోరి లాల్ శర్మ అమేథి నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ రెండు సీట్లకు నామినేషన్ వేసే తుది గడువు నేడే. ఈ రెండు సీట్లకు మే 20న పోలింగ్ జరుగనున్నది. కాగా బిజెపి స్మృతి ఇరానీని అమేథి నుంచి, మంత్రి దినేశ్ ప్రతాప్ ను రాయ్ బరేలి నుంచి పోటీకి దింపింది. ఆ ఇద్దరు ఇదివరలో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.