Sunday, December 22, 2024

కేజ్రీవాల్ అరెస్టు వెనుక ఓ భారీ కుట్ర

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కుట్రలో భాగంగానే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైకెర్టరేట్(ఇడి) అరెస్టు చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక ఇంటర్వూలో స్పష్టం చేశారని ఢిల్లీ మంత్రి అతిషి శుక్రవారం వెల్లడించారు. ఒదటిసారి సమన్లు పంపించినపుడే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాలన్నది ఇడి ఉద్దేశమని అమిత్ షా ఇటీవల ఒక న్యూస్ చానల్‌కు ఇంటర్వూలో చెప్పారని ఆమె ఆరోపించారు.

కేజ్రీవాల్‌కు ఇడి నుంచి సమన్లు వచ్చిన నాటి నుంచే ఆయనను అరెస్టు చేయడానికి కుట్ర జరిగిందని విలేకరులత సమావేశంలో మట్లాడుతూ ఆమె ఆరోపించారు. అవి ఇడి పంపిన సమన్లు కావని అవి బిజెపి సమన్లని ఆమో ఆరోపించారు. ఇంత జరుగుతున్నా బిజెపి అధికార ప్రతినిధులు మాత్రం ఇడి ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థని, ఆ సమన్లతో బిజెపికి ఎటువంటి సంబంధం లేదని బుకాయించారని ఆమె విమర్శించారు.

పదేళ్ల బిజెపి దుష్పరిపాలనను కేజ్రీవాల్ ఎండగతారని బిజెపి భయపడిందని ఆమె అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉందని, అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి జైలుకు పంపాలన్న ఉద్దేశం ఇడికి మొదటి నుంచి ఉందని స్వయంగా హోం మంత్రే ఇంటర్వూలో బయటపెట్టారని ఆమె తెలిపారు. కేజ్రీవాల్‌ను పిలిపించి అరెస్టు చేసేందుకు సమన్లు ఒక సాకు మాత్రమేనని అమిత్ షా అన్నారని ఆమె వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News