Monday, December 23, 2024

వయనాడ్‌లో రాహుల్ ఓటమి ఖాయం

- Advertisement -
- Advertisement -

గతంలో జరిగిన అన్ని ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుచుకునే సీట్లు అత్యల్పమని ప్రధాని నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. కేరళలోని వయనాడ్‌లో ఓడిపోతానన్న భయంతోనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి పోటీచేయాలని నిర్ణయించుకున్నారని మోడీ ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని బర్ధమాన్‌లో శుక్రవారం ఒక ఎన్నికల ప్రచార సభలో మోడీ ప్రసంగిస్తూ కాంగ్రెస్‌కు అధికారమిస్తే ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసిల రిజర్వేషన్ల్ల కోటాలను లాక్కుని తన బుజ్జగింపు రాజకీయాలను కొనసాగించడానికి వీలుగా జిహాదీ ఓటు బ్యాంకుకు దారాతత్తం చేస్తుందని ఆరోపించారు. ఉత్తర్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మిత్రపక్షమైన సమాజ్‌వాది పార్టీకి చెందిన అభ్యర్థి ఒకరు చేసిన ఓటు జిహాద్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నందుకు ఇండియా కూటమిని, కాంగ్రెస్ పార్టీని ఆయన దుయ్యబట్టారు.

ఒపీనియల్ పోల్స్ లేదా ఎగ్జిట్ పోల్స్ అవసరమే లేదు. వారి(కాంగ్రెస్) ఓటమి గురించి పార్లమెంట్‌లో ఎప్పుడో చెప్పాను. వారి సీనియర్ నాయకురాలు లోక్‌సభ సీటును వదులుకుని రాజస్థాన్ నుంచి రాజ్యసభ ద్వారా పార్లమెంట్‌లో ప్రవేశించినప్పుడే ఓటమిని వారు పసిగట్టారని అర్థమై పోయింది అంటూ పరోక్షంగా సోనియా గాంధీని ఎద్దేవా చేశారు. ఇక ఇప్పుడు అమేథీలో ఓడిపోయి వయనాడ్(కేరళ)కు వెళ్లిపోయిన కాంగ్రెస్ యువరాజురాయ్‌బరేలి నుంచి కూడా పోటీ చేస్తున్నారని రాహుల్ గాంధీని ఉద్దేశించి మోడీ వ్యాఖ్యానించారు. ఈసారి వయనాడ్‌లో కూడా ఓడిపోతానని ఆయనకు అర్థమైపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. మత ప్రాదికన రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగాన్ని సవరించబోనని కాంగ్రెస్ రాతపూర్వకంగా ఇవ్వాలని ఆయన సవాలు విసిరారు.

ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసిల రిజర్వేషన్లను లాక్కుని వాటిని మత ప్రాదిపదికపై తమ ఓటు బ్యాంకుకు అందచ్యేబోమని కాంగ్రెస్ ఇండియా కూటమి లిఖితపూర్వక ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చివేసిందని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News