Friday, January 3, 2025

సైబరాబాద్‌లో రూ.98లక్షలు పట్టివేత

- Advertisement -
- Advertisement -

ఎలాంటి ఆధారాలు లేకుండా నగదు తరలిస్తున్న బ్యాంక్ నగదు, రెండు వాహనాలను సైబరాబాద్ పోలీసులు శుక్రవారం సీజ్ చేశారు. వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు రూ.98లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్, శామీర్‌పేట, దుండిగల్ పరిధిలో ఎస్‌ఓటి పోలీసులు తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలోనే బ్యాంక్‌లకు నగదు తీసుకుని వెళ్లే వాహనాలను ఆపి తనిఖీ చేయగా నగదు లభించింది. ఈ వాహనాలకు సరైన క్యూఆర్ కోడ సరిగా లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు సీజ్ చేశారు. డబ్బులు ఎక్కడికి తరలిస్తున్నారు, ఎవరి కోసం తరలిస్తున్నారనే కోణంలో విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News