Monday, December 23, 2024

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి రాధిక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మరణించిన పిహెచ్‌డి స్కాలర్ రోహిత్ వేముల తల్లి రాధిక వేముల శనివారం ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిని కలిశారు. తనకు న్యాయం జరిగేలా చూడాలని రోహిత్ తల్లి విజ్ఞప్తి చేశారు. 2016లో జరిగిన ఆత్మహత్యపై తెలంగాణ పోలీసులు గత నెలలో దాఖలు చేసి మూసివేత నివేదికపై న్యాయం చేయాలని కోరారు. అయితే, ఈ వార్త వెలువడిన తర్వాత, పోలీసుల దర్యాప్తుపై రోహిత్ కుటుంబం కొన్ని సందేహాలు వ్యక్తం చేసినందున దర్యాప్తు కొనసాగుతుందని తెలంగాణ పోలీసు డైరెక్టర్ జనరల్ రేవి గుప్తా తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ ప్రకారం, కేసుపై దర్యాప్తుకు ఆదేశిస్తానని రేవంత్ హామీ ఇచ్చారని, రోహిత్ వేములకి న్యాయం చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News