Monday, December 23, 2024

నటుడు వెంకటేశ్ కుమార్తె ఎన్నికల ప్రచారం అదరహో

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: సినీ నటుడు విక్టరీ వెంకటేశ్ కూతురు ఆశ్రిత ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. ఆమె ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామి రెడ్డికి మద్దతుగా ఎన్నిక ప్రచారం నిర్వహించింది. ఆశ్రిత తన ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఆమె ప్రసంగిస్తుంటే ప్రజలు విని ఆనందించారు.

‘‘మా మామ రఘురామి రెడ్డి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగి పోటీ చేస్తున్నారు. ఆయన ఏ పనిచేసినా పూర్తిగా చేస్తారు. ఆయనను గెలిపిస్తే మీ సమస్యలను ఢిల్లీ దాకా తీసుకెళ్లి పరిష్కరిస్తారన్న నమ్మకం నాకుంది.  రఘు రామి రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించండి’’ అని ఆశ్రిత ఓటర్లకు విన్నవించారు. మే 7న తన తండ్రి, నటుడు విక్టరీ వెంకటేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని కూడా ఆమె ఈ సందర్బంగా ప్రజలకు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News