- Advertisement -
రైతు బంధుపై కెసిఆర్ కు సిఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నెల 8వరకు రైతుబంధు వేస్తే.. కెసిఆర్ ముక్కు నేలకు రాయాలని అన్నారు. కొత్తగూడెంలో జరిగిన జనజాతర సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ… ఈ నెల 8వ తేదీ నాటికి రైతుభరోసా పూర్తి చేస్తామని చెప్పారు.
మొత్తం 69 మంది లక్షల రైతుల్లో ఇప్పటి వరకు 65 లక్షల మంది ఖాతాల్లో రైతబంధు డబ్బులు జమ చేశామని, నాలుగు లక్షల మందికీ ఈ నెల 8 వరకు పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 9న కెసిఆర్ అమరవీరుల స్థూపం వద్దకు రావాలని, రైతుబంధు పూర్తిగా అమలు చేయకుంటే.. తాను ముక్కు నేలకు రాస్తానని, లేకుంటే కెసిఆర్ ముక్కు నేలకు రాస్తావా అని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు.
- Advertisement -