Monday, January 20, 2025

అమిత్ షా ఫేక్ వీడియో కేసులో అరుణ్ రెడ్డి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

కేంద్ర మంత్రి అమిత్‌షా ఫేక్ వీడియో కేసులో తెలంగాణకు చెందిన అరుణ్ రెడ్డిని ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టుచేశారు. అరుణ్‌రెడ్డి స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ పేరుతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు.కాంగ్రెస్ సోషల్ మీడియా జాతీయ సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. పాటియాలా కోర్టు జడ్జి నివాసంలో నిన్న రాత్రి అరుణ్‌ను ఢిల్లీ పోలీసులు హాజరు పరిచారు. అరుణ్ రెడ్డిని మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి జడ్జి ఇచ్చారు. అరుణ్ రెడ్డిని అమిత్ షా ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో అరుణ్ రెడ్డి ఫోన్లను ఢిల్లీ పోలీసులు సీజ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News