- Advertisement -
సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తాను పోటీ చేసే నియోజకవర్గంలోనే తన ఓటు ఉంటుంది. కానీ ఈ పార్లమెంటు ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. లోక్ సభ ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులు తమ ఓటును తాము వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం వారికి తాము పోటీ చేసే నియోజకవర్గంలో కాకుండా ఇతర నియోజక వర్గాల్లో ఓటు ఉండటమే.
అటువంటి వారిలో హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఓటు చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో ఉంది. హైదరాబాద్ బిజెపి ఎంపి అభ్యర్థి మాధవీ లత ఓటు మల్కాజిగిరిలో పరిధిలో ఉంది. హైదరాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ సమీర్ ఓటు సికింద్రాబాద్ పరిధిలో ఉంది. దీంతో వీరందరికి తాము పోటీ చేసే నియోజకవర్గంలో తమ ఓటు వేసుకునే అవకాశం లేకుండా పోయింది.
- Advertisement -