Sunday, December 22, 2024

పదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చింది రూ.9 లక్షల కోట్లు

- Advertisement -
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు రూ.9 లక్షల కోట్లు ఇచ్చిందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. తెలంగాణకు యుపిఏ హయాంలో ఎక్కువ నిధులు వచ్చాయా..? లేక ఎన్డీయే హయాంలో ఎక్కువ నిధులు వచ్చా యో చర్చిద్ధాం రావాలని సిఎంకు కిషన్ రెడ్డి సవాల్ చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. చర్చ కొడంగల్‌లో అయినా, రాష్ట్ర అమర వీరుల స్థూపం వద్ద అయినా సరే తాము సిద్ధమని ఆ లేఖలో పేర్కొన్నారు. బిజెపి తెలంగాణలో చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు రేవంత్‌రెడ్డికి దమ్ము, ధైర్యం ఉండా అని ప్రశ్నించారు.

పదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం 9 లక్షల కోట్ల ఇచ్చిన వివరాలను తాము లెక్కలుతో సహా చూపిస్తామని అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్న దశాబ్ధ కాలం పాటు ఏ పథకాలు అమలు చేశారు, ఎన్ని నిధులు ఇచ్చారో, ఎంత ఖర్చు పెట్టారో రేవంత్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానిగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అభివృద్ధికి, సంక్షేమ పథకాలకు ఇచ్చిన నిధులెన్నో తాను చర్చకు వస్తానని అన్నారు. జాతీయ రహదారులు, రైల్వే నెట్‌వర్క్ రైతుల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వంటి వాటిలో మోడీ ఏం చేశారో తాను చెప్తానని, కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో రేవంత్‌రెడ్డి స్పష్టం చేయాలని ఆ లేఖలో సవాల్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News