Monday, December 23, 2024

హస్తం గూటికి టిడిపి సీనియర్ నేత శ్రీశైలం

- Advertisement -
- Advertisement -

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ ఉపాధ్యక్షుడు డి. శ్రీశైలం శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి శ్రీశైలంను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్ళారు. శ్రీశైలంతో పాటు పలువురు టిడిపి నాయకులు, ఆయన అనుచరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

శ్రీశైలం 2018 నుంచి తెలంగా టిడిపి ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతకు ముందు 2016 నుంచి 2018 వరకు పార్టీ ప్రధాన కార్యదర్శింగా బాధ్యతలు నిర్వహించారు. గతంలో మెదక్ జిల్లా ఆందోల్ నియోజవకర్గం టిడిపి ఇంచార్జిగా వ్యవహరించారు. 201213లో టిడిపి జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్న మీ కోసం పాదయాత్ర సందర్భంగా మీడియా ఇంచార్జిగా వ్యవహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News