నేడు కోల్‌కతాతో లక్నో ఢీ
లక్నో: ఐపిఎల్‌లో మరో రసవత్తర పోరుకు సర్వం సిద్ధమైంది. ఎకానా మైదానం వేదికగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య పోరు జరుగనుంది. ఇరు జట్లు కూడా ఈ సీజన్‌లో అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్నాయి. పాయింట్ల పట్టికలో కోల్‌కతా రెండో, లక్నో మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవాలనే లక్షంతో ఇరు జట్లు కనిపిస్తున్నాయి.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో కోల్‌కతా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. స్వల్ప లక్ష్యాన్ని సయితం కాపాడుకుని జయకేతనం ఎగుర వేసింది. ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, మనీష్ పాండే, రసెల్ తదితరులతో కోల్‌కతా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. కిందటి మ్యాచ్‌లో వెంకటేష్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించాడు. తీవ్ర ఒత్తిడిలోనూ చిరస్మరణీయ బ్యాటింగ్‌ను కనబరిచాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. మనీష్ పాండే కూడా ఫామ్‌లోకి రావడం జట్టుకు ఊరటనిచ్చే అంశమే.
సాల్ట్, నరైన్, అయ్యర్‌లు జోరుమీదున్నారు. నరైన్, సాల్ట్‌లు మరోసారి మెరుపు ఆరంభాన్ని అందిస్తే ఈసారి కూడా కోల్‌కతాకు భారీ స్కోరు ఖాయం. మరోవైపు లక్నో కూడా ఈ సీజన్‌లో అద్భుతంగా ఆడుతోంది. పది మ్యాచుల్లో ఆరింటిలో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను మరింత పదిలం చేసుకోవాలని భావిస్తోంది. కెప్టెన్ రాహుల్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.మార్కస్ స్టోయినిస్ ఫామ్‌లో ఉన్నాడు. దీపక్ హుడా, అయూష్ బడోని, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్య, రవి బోష్ణోయ్ తదితరులతో జట్టు చాలా బలంగా ఉంది. సొంత గడ్డపై మ్యాచ్ జరుగుతుండడం కూడా లక్నోకు సానుకూల అంశంగా చెప్పాలి.