- Advertisement -
హైదరాబాద్: బంజారాహిల్స్ లోని ఆఫ్టర్ 9 పబ్ పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఆఫ్టర్ 9 పబ్ లో అశ్లీల నృత్యాలు చేసిన దాదాపు 45 మంది మహిళలను అదుపులోకి తీసుకొని రెస్క్యూ హోమ్ కు తరలించినట్లు సమాచారం. ఆఫ్టర్ 9 పబ్ లో అశ్లీల నృత్యాలు చేస్తున్నట్టు పోలీసులకు పక్కాగా సమాచారం రావడంతో దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సమయం దాటిన తరువాత సదరు పబ్ ను రన్నింగ్ చేయడంతో నిర్వహకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన మహిళలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్టు సమాచారం.
- Advertisement -